Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ గురించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్.

ఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ గురించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్.

NTR-Buchibabu: ఆర్ఆర్ఆర్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాని ఎప్పుడో ప్ర‌క‌టించారు. ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లే టైమ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా ఫాస్ట్ గా జ‌రుగుతోంది. జూన్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమా త‌ర్వాత ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా చేయ‌నున్నార‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆత‌ర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింద‌ని.. ఓసారి వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత‌ ఈ ప్రాజెక్ట్ ఉంది కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు అని మ‌రోసారి వార్త‌లు వ‌చ్చాయ‌. ఇలా ఈ సినిమా గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావ‌డం లేదు.

తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా ఖ‌చ్చితంగా ఉంటుంద‌ట‌. ఈ చిత్రానికి సంగీత సంచ‌ల‌నం ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నార‌ని.. ఆయ‌న్ని సంప్ర‌దించ‌డం జ‌రిగింద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే.. కొర‌టాల శివ‌తో సినిమాతో పాటు ప్ర‌శాంత్ నీల్ తో సినిమా కూడా ఉంది. అందుచేత ఎన్టీఆర్ బుచ్చిబాబుతో సినిమాను ఎప్పుడు చేస్తార‌నేది ఇంకా క్లారిటీ లేదు అంటున్నారు. మ‌రి.. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : ఎన్టీఆర్ సరసన దీపికా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్