Communal Harmony In India :
భారతీయుల గురించి, వారి మత విశ్వాసాల గురించి స్వదేశంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఒక సర్వే మాత్రం జాతీయతావాదాన్ని ప్రతిఫలించింది. అమెరికాకుచెందిన మేథోమధన సంస్థ ప్యూ నిర్వహించిన పరిశీలనలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. సుమారు ముప్ఫయివేల మందిని, 17 భాషలకు చెందినవారిని సుమారు ఆరునెలలు పరిశీలించారు. వారిని మత సామరస్యం, జాతీయతావాదం వంటి అంశాలపై అభిప్రాయం అడిగారు. ఈ సందర్భంగా వెల్లడైన అభిప్రాయ సమాహారం…
నిజమైన భారతీయుడు అన్ని మతాలను గౌరవిస్తాడని అత్యధికుల అభిప్రాయం. భారతదేశంలో అన్ని మతాల వారికి తగు స్వేచ్ఛ ఉందని మెజారిటీ భావన. అన్ని మతాల్లోనూ పెద్దలని గౌరవించడం అత్యావశ్యకమైన విషయం. హిందువులు, ముస్లిములు కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం విశేషం. మెజారిటీ హిందువులతో పాటు క్రైస్తవులు కూడా గంగానది పాపాల్ని హరిస్తుందని నమ్ముతున్నారు. మూడింట రెండువంతుల మంది హిందువులు నిజమైన భారతీయుడిగా ఉండాలంటే హిందుత్వమే మూలమని భావిస్తున్నారు. ఎన్ని మతాలున్నా తమదే ప్రత్యేకమని హిందువులు, ముస్లిములు భావిస్తున్నారు. జైనులు, బౌద్ధులు మాత్రం తాము హిందూ మతానికి దగ్గరివారుగా భావిస్తున్నారు. హిందీలో మాట్లాడటం కూడా హిందుత్వానికి, జాతీయతావాదానికి ప్రతీకగా హిందువుల భావన. ఇతరమతాలను గౌరవించడం, సామరస్యంగా మెలగడం సమాజంలో మనడానికి తమ మతానికి మేలు కలిగేందుకు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్యూ సంస్థ సర్వే భారతీయ ఆత్మని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పడం విశేషం.
Also Read : రోగనిరోధక శక్తే శ్రీరామ రక్ష