Sunday, April 14, 2024
HomeTrending Newsకే.ఆర్.ఎం.బి.కి లేఖ : జగన్

కే.ఆర్.ఎం.బి.కి లేఖ : జగన్

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఏపి ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణా మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్‌ భేటీ  సందర్భంగా సీఎం జగన్‌ నీటి వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని, తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, సున్నితమైన సమస్యను సామరస్యంగా పరిష్కారించుకునే దిశగా ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు. శ్రీశైలం విద్యుదుత్పత్తి ఆపేయాలని, అనుమతి లేకుండా నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీకి లేఖ రాయాలని జగన్‌ స్పష్టం చేశారు.

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? అని జగన్ ప్రశ్నించారు.  నీటి అంశంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సూచించారు.  తెలంగాణ విద్యుదుత్పత్తి విషయంపై మరోసారి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్