Monday, June 8, 2026
Homeసినిమాఆర్ఆర్ఆర్ నుంచి భీమ్ వీడియో విడుద‌ల‌

ఆర్ఆర్ఆర్ నుంచి భీమ్ వీడియో విడుద‌ల‌

Brace Yourself for Bheem:
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సినిమా ఎప్పుడు విడుద‌లవుతుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అన్ని అడ్డంకుల‌ను దాటుకుని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ ట్రైల‌ర్ ను థియేట‌ర్లో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే.. ఈ రోజు తాజాగా భీమ్ కి సంబంధించిన చిన్నపాటి వీడియోను విడుదల చేశారు. ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్’ అంటూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైల‌ర్ పై అంచ‌నాల‌ను ఇంకా పెంచేసింది ఈ వీడియో. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై డివివి దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read : డిసెంబర్ 9న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular