Friday, March 29, 2024
HomeTrending Newsత్వరలో కొండాపూర్ లో డయాలసిస్ యూనిట్

త్వరలో కొండాపూర్ లో డయాలసిస్ యూనిట్

Dialysis Unit In Kondapur Soon :

రంగారెడ్డి జిల్లా కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల నూతన అంతస్తును ఈ రోజు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కరోన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో రహేజా కార్ప్ ముందుకు వచిందని, 100 పడకల ఫ్లోర్ ని ఈరోజు ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు.

కోవిడ్ సమయంలో హైదరాబాద్ లో 1300 పడకలను అదనంగా సీఎస్ ఐఆర్ లో భాగంగా వివిధ సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశామన్నారు. 33 జిల్లాల్లో 6000 పడకలతో చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ విభాగాలు అందుబాటిలోకి రాగా  ప్రభుత్వం మూడో వేవ్ ఎదుర్కునేందుకు ప్రణాళికతో సిద్దంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రు. 154 కోట్లతో 900 లకు పైగా icu బెడ్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయని డయాలసిస్ యూనిట్ ల పెంపుకు కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.

కొండాపూర్ లో అతి త్వరలో ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని, కార్పొరేటర్ లు తమ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ అందేలా చూడాలి. రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి ఆరా తీయాలన్నారు.

Also Read : బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్