Saturday, January 18, 2025
Homeసినిమా'అన్ స్టాప‌బుల్ 2' సాంగ్ తో అద‌ర‌గొట్టిన బాల‌య్య‌

‘అన్ స్టాప‌బుల్ 2’ సాంగ్ తో అద‌ర‌గొట్టిన బాల‌య్య‌

నంద‌మూరి  బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్ చేసిన టాక్ షో అన్ స్టాప‌బుల్ విత్ ఎన్.బి.కే. ఈ టాక్ షో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో అంద‌రికీ తెలిసిందే. తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అయిన‌ ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దీంతో ఇప్పుడు సీజన్-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహా టీమ్ ఇటీవలే అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే టాక్ షో సీజన్-2 ను అధికారికంగా ప్రకటించింది.

ఇందులో భాగంగా తాజాగా అన్ స్టాపబుల్ ఆంథెమ్ ను విడుదల చేేశారు. “ఏదీ.. నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్” అని బాలయ్య చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ర్యాప్ సాంగ్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్ స్టాపబుల్ థీమ్ సాంగ్ కు మహతి స్వర సాగర్ ట్యూన్ కంపోజ్ చేశారు. రోల్ రైడా లిరిక్స్ రాయడమే కాదు.. ర్యాప్ ఆలపించారు. తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా.. డైలాగు వదిలితే మోగిపోద్ది బాడీ అంతా.. అంటూ బాలకృష్ణ ను హైలైట్ చేస్తూ ఈ పాట సాగింది.

అన్ స్టాప‌బుల్ సీజన్ -1 కోసం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన విజువల్స్ నే ఈ ర్యాప్ సాంగ్ లో ఉపయోగించారు. అలానే మొదటి సీజన్ కు గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలను కూడా ఇందులో భాగం చేశారు. తెర వెనుక ఈ షో కోసం ఎలాంటి సన్నాహాలు జరిగాయనేది చూపించారు. ఎంటర్టైన్మెంట్ నువ్ తినే ఫుడ్ లో ఉందేమో.. నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్ అంటూ బాలయ్య అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే -2 ద్వారా మరోసారి అలరించనున్నట్లు చెప్పకనే చెప్పారు. దీంతో రెండో సీజన్ కు ఎవరెవరు గెస్టులుగా వస్తారనేది అందరిలో ఆసక్తికరంగా మారింది.

Also Read : బాల‌య్య అన్ స్టాప‌బుల్ క్రేజీ అప్ డేట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్