Saturday, January 18, 2025
Homeసినిమాఅఖిల్ మూవీలో మోహన్ లాల్? లేక ఉపేంద్రా.?

అఖిల్ మూవీలో మోహన్ లాల్? లేక ఉపేంద్రా.?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే.. 2020లో కరోనా కారణంగా ఆగింది.  2021 జూన్ 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ విడుదల అని ప్రకటించారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. అఖిల్, స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసిందని చెప్పచ్చు. ఆమధ్య సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కరోనా కారణంగా ఆగింది కానీ.. లేకపోతే ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది. ఇందులో ఓ ముఖ్య పాత్ర ఉందట. ఆ పాత్రను మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ తో చేయిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పేరు వినిపిస్తోంది. ఉపేంద్ర ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ సినిమాలో నటింపజేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. ఏజెంట్ మూవీలో ముఖ్యపాత్రను మోహన్ లాల్ తో చేయిస్తున్నారా.? లేక ఉపేంద్రతో చేయిస్తున్నారో త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్