కాశీలో మూడు రోజులు దర్శనాలకు బ్రేక్

A Three Day Break For Visits To Kashi Vishwanath In Varanasi :

ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శనాలకు మూడు రోజులపాటు బ్రేక్‌పడనుంది. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి.

కరోనా సమయంలో మొదటిసారి ఆలయం మూసివేసి ఆలయంలో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. గత సంవత్సరం దర్శనంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినప్పటికీ, ఇప్పుడు డిసెంబర్ 13న శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం ఆలయాన్ని మరోసారి మూసివేస్తున్నారు. సాధారణ భక్తుల కోసం మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Also Read : చార్ ధాం యాత్రకు ఆరు నెలలు బ్రేక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *