Sunday, January 19, 2025
Homeసినిమా‘స‌ర్కారువారి పాట‌’ బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్ టైమ్.....

‘స‌ర్కారువారి పాట‌’ బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్ టైమ్…..

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ లేటెస్ట్ మూవీ ‘స‌ర్కారు వారి పాట‌’ లేటెస్ట్ మోస్ట్ అవెయిటింగ్ మూవీగా అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతోంది. ఆగ‌స్ట్ 9న మ‌హేష్‌ పుట్టిన‌రోజు.. ఈ సంద‌ర్భంగా గ్రాండ్ బ‌ర్త్ డే స్పెష‌ల్ ప్ర‌మోష‌న్స్ ను స్టార్ట్ చేసి ఫ‌స్ట్ నోటీస్ అంటూ రిలీజ్ చేసిన లుక్‌కి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌లో ఇది స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. అందులో మ‌హేష్‌ లుక్ ఇది వ‌ర‌కెన్న‌డూ లేనంత కొత్త‌గా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ‘స‌ర్కారువారి పాట‌’ నుంచి ఆగ‌స్ట్ 9న ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు వీడియో విడుద‌లవుతున్నట్లు ప్ర‌క‌టించారు.

ఫ‌స్ట్ రిపోర్ట్ అనౌన్స్‌మెంట్‌లో మ‌హేష్‌ బ్యాక్‌ పోజులో చేతిలో బ్యాగుతో ఉన్న పోస్ట‌ర్ విడుదలైంది. ఇప్పుడు జీఐఎఫ్ మ‌హేష్‌ ఫ్రంట్ పోజుతో న‌డుముకున్న బెల్టును క‌ట్టుకోవ‌డాన్ని చూడొచ్చు. మ‌హేష్‌ లుక్ కూల్‌, ఛార్మింగ్‌గా ఉంది. ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు టీజ‌ర్ ఎలా ఉండ‌బోతుందోన‌నే అంచ‌నాలు ఆశాకాన్నంటాయి. సినీ ప్రేక్ష‌కులు, అభిమానులు డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం.. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ ను ఈ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్‌లో ఎంత కొత్త‌గా ఎలివేట్ చేస్తాడోన‌ని ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్న ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌ధ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి ఆర్‌.మ‌ది సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె.వెంక‌టేశ్ ఎడిట‌ర్‌. ఎ.ఎస్‌.ప్ర‌కావ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్