Sunday, January 19, 2025
Homeసినిమాఆక‌ట్టుకుంటున్న`ఆడవాళ్ళు మీకు జోహార్లు` టీజర్

ఆక‌ట్టుకుంటున్న`ఆడవాళ్ళు మీకు జోహార్లు` టీజర్

Teaser hit: యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ న‌టించిన‌ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఈ వేసవిలో విడుదల కాబోతున్న చిత్రాల్లో ఒకటి. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చాలా పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రం నాన్-థియేట్రికల్ హక్కులు మేకర్స్‌ కు భారీ ఆఫ‌ర్‌ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు టీజర్ రిలీజ్ చేశారు.

టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. మహిళలు కుటుంబం పై ఆధిపత్యం చెలాయించడం వల్ల తన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్యను శర్వానంద్ వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది. తన కుటుంబంలోని 10 మంది మ‌హిళా స‌భ్యుల అంగీకారం పొందడం అంత సులభం కాదు. కాబట్టి, పెళ్లికి సరైన అమ్మాయిని వెతకడం అతనికి చాలా కష్టమనిపిస్తుంది. అప్పుడు, రష్మిక మందన్నను కలుసుకుంటాడు, అన్ని మంచి లక్షణాలున్న భ‌ర్త‌గా అత‌ను ఆమెకు క‌నిపిస్తాడు. అయితే, కథలో ట్విస్ట్ ఏమిటంటే, మ‌న వివాహం అసాధ్యం అని ఆమె చెబుతుంది.

తిరుమల కిషోర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వర్కబుల్ సబ్జెక్ట్‌ తో ముందుకు వచ్చారు. టీజర్ తగినంత వినోదాన్ని అందిస్తుంది. ఇందులో శర్వానంద్, రష్మిక మందన్న ఒకరితో ఒకరు అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. శర్వానంద్ అందంగా కనిపించాడు. త‌న‌ పాత్రలో చాలా కూల్‌గా ఉన్నాడు. రష్మికకు స‌రైన పాత్ర వచ్చింది. త‌ను అందంగా కనిపించింది. సుజిత్ సారంగ్ కెమెరా పనితనం ఆక‌ర్ష‌ణీయంగా వుంది. ఇందులో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ టీజర్‌కు ఆహ్లాదకరమైన బిజీఎమ్ అందించారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనేది అన్ని ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్ప‌చ్చు. ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు శివ‌రాత్రి కానుక‌గా ఫిబ్రవరి 25నే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read : ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’

RELATED ARTICLES

Most Popular

న్యూస్