Saturday, June 13, 2026
Homeసినిమాఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ క్రేజీ ఫస్ట్ లుక్ విడుదల

ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ క్రేజీ ఫస్ట్ లుక్ విడుదల

Crazy: మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా వుంది. ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ లో చాలా యంగ్ అండ్ రిఫ్రెషింగ్ కనిపిస్తున్నారు.

ఫస్ట్ లుక్ వీడియో లో ఆది చేష్టలు సినిమా టైటిల్ కి తగ్గట్టు చాలా క్రేజీగా వున్నాయి. హెయిర్ స్టయిల్ , ట్రెండీ దుస్తులు, లైట్ గడ్డం ఇవన్నీ అది లుక్ ని మరింత స్టయిలీస్ గా చూపించాయి. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, ‌ సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular