Saturday, June 13, 2026
Homeసినిమా30న ఆది'టాప్ గేర్' గ్రాండ్ రిలీజ్

30న ఆది’టాప్ గేర్’ గ్రాండ్ రిలీజ్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్  వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా టాప్ గేర్ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ తో సిద్ధమయ్యారు. కె. శశికాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది.  గత కొన్ని రోజులుగా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 30న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.టాప్ గేర్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా సిధ్ శ్రీరామ్ పాడిన వెన్నెల పాట, మూవీ టీజర్.. ఇలా అన్నీ కూడా ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకోవడంతో సినిమా పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular