Friday, May 31, 2024
Homeసినిమా‘ఏషియన్ తారకరామ’ థియేటర్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

‘ఏషియన్ తారకరామ’ థియేటర్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ వైభవంగా పునః ప్రారంభించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పై వున్న అభిమానంతో  ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ ను పునరుద్ధరించారు. నందమూరి బాలకృష్ణ, ప్రొడ్యూసర్ శిరీష్ చేతులు మదుగా గ్రాండ్ గా జరిగింది.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా కన్నతండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. తారకరామ థియేటర్ కి ఎంతో గొప్ప చరిత్ర వుంది. నాన్న గారు ఏది చేసినా చరిత్రలో నిలిచిపోయేటట్లు చేస్తారు. అది ఆయన దూరదృష్టి. ఆయన నటిస్తుంటే.. జానపదాలు జావళీలు పాడాయి. పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. సాంఘికాలు సామజవరగమనాలు పాడాయి. కళామతల్లి కళకళలాడింది. నటనకు జీవం పోసిన నటధీశాలుడు నందమూరి తారకరామారావు గారు.”

” తెలుగువారి స్ఫూర్తి ప్రదాత తారకరామారావు గారు. చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్నప్పుడు ఇక్కడ  ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రారంభించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రస్థానం మొదలుపెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక పర్యటక స్థలంగా వుండేది. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. ఈ థియేటర్ కి ఒక చరిత్ర వుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్మగారి జ్ఞాపకార్ధం కట్టిన ఓ దేవాలయం. తారకరామ థియేటర్ కూడా అమ్మ నాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం. 1978లో ‘అక్బర్ సలీం అనర్కాలి’తో ఈ థియేటర్ ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 95లో కొన్ని అనివార్యకారణాల వలన మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది మూడోసారి. ఈ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది. డాన్ సినిమా ఇక్కడ 525 రోజులు ఆడింది. అలాగే నా సినిమాలు ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మావయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘అనసూయమ్మగారి అల్లుడు’.. ఇలా అన్నీ సినిమాలు అద్భుతంగా ఆడాయి. అలాగే మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ పేరు కూడా ఈ థియేటర్ లోనే నాన్న గారు నామకరణం చేశారు” అంటూ బాలయ్య వివరించారు,

RELATED ARTICLES

Most Popular

న్యూస్