దగ్గుబాటి బ్రదర్స్ రానా, అభిరామ్.. ఇద్దరూ ఊహించని విధంగా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. రానా ముందుగా టెక్నీషియన్ గా ఇంట్రీ ఇచ్చాడు. అలాగే నిర్మాతగా కూడా మారి బొమ్మలాట అనే సినిమాను నిర్మించాడు. ఇలా టెక్నీషియన్ గా, ప్రొడ్యూసర్ గా పరిచయమైన రానా ఊహించని విధంగా హీరోగా ఎంట్రీ ఇచ్చి సర్ ఫ్రైజ్ చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాకే విభిన్నమైన కథను ఎంచుకున్నాడు. ఆతర్వాత పలు విభిన్నమైన కథా చిత్రాల్లో నటించిన రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకున్నాడు.
నిర్మాతగా, హీరోగా రాణిస్తున్న రానా ఇప్పుడు తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక రానా తమ్ముడు అభిరామ్ కూడా నిర్మాతగా సినిమాలు నిర్మిస్తాడు అనుకుంటే.. అహింస సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సర్ ఫ్రైజ్ చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పటి వరకు సెకండ్ మూవీ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. ఈ దగ్గుబాటి బ్రదర్స్ మధ్య గొడవలు వచ్చాయని.. అభిరామ్ ని ఇంట్లోకి బయటకు పంపించేశారని ఇలా రకరకాల వార్తలు ఆమధ్య ప్రచాంరలోకి వచ్చాయి. ఇది నిజమా…? నిజంగా ఇలా జరిగిందా..? అనే డౌట్ చాలా మందిలో ఉంది.
అయితే.. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో అభిరామ్ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. ప్రచారంలో ఉన్నట్టుగా రానా అన్నతో తనకు ఎలాంటి గొడవలేదన్నారు. తనని ఒక తమ్ముడులా కాకుండా ఫ్రెండ్ లా చూస్తాడని.. నాన్న, అన్న, బాబాయ్ తనకు మంచి సలహాలు ఇస్తారని.. ఇంట్లోంచి పంపిచేయడం అలాంటి ఏమీ జరగలేదని అవన్నీ పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చాడు. సెకండ్ మూవీ ఎప్పుడంటే.. ఓ పన్నెండు స్ర్కిప్టులు వచ్చాయని.. అందులో ఏది బెస్ట్ స్ర్కిప్ట్ అనేది తన టీమ్ ఫైనల్ చేసిన తర్వాత ప్రకటిస్తాన్నాడు.