Sunday, January 19, 2025
Homeసినిమా152 థియేట‌ర్ల‌లో చిరు 152వ చిత్రం ట్రైల‌ర్

152 థియేట‌ర్ల‌లో చిరు 152వ చిత్రం ట్రైల‌ర్

Acharya: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ, క్రేజీ మూవీ ఆచార్య‌. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. అయితే.. ఈ క్రేజీ మూవీ ఆచార్య చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తున్నారు.

ప్రేక్ష‌కాభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న ట్రైలర్‌ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 12న‌ సాయంత్రం ఆచార్య 5:49 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. అయితే.. ఇక్కడో ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే.. ఆచార్య చిత్రం చిరంజీవి 152వ చిత్రం. అందుచేత‌ మేకర్స్‌ ఓ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. ట్రైలర్‌ను సోషల్‌ మీడియాతోపాటు ముఖ్యమైన 152 థియేటర్‌లలో ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని థియేటర్లలో ఆచార్య ట్రైలర్ ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు.

Also Read : ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎప్పుడు? ఎక్క‌డ‌?

RELATED ARTICLES

Most Popular

న్యూస్