Sunday, January 19, 2025
Homeసినిమామరోసారి షాక్ ఇచ్చిన ఆచార్య

మరోసారి షాక్ ఇచ్చిన ఆచార్య

చిరంజీవి, రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఆచార్య‘. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో అనుకున్నారు. అయితే.. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశే మిగిల్చింది. ఈ మూవీ డిజాస్టర్ అవ్వడంతో కొరటాల కెరీర్ పై బాగా ప్రభావం చూపించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ రిలీజ్ చేశారు. చరణ్.. శంకర్ తో మూవీ చేస్తున్నారు కానీ.. కొరటాల ఇప్పటి వరకు నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయలేదు.

అయితే… థియేటర్లో ఆకట్టుకోలేకపోయిన ఆచార్య ఓటీటీలో విడుదలైనా అక్కడ కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ భారీ రేటుకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడే  జెమినీ టీవీ డీల్ క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కూడా టాక్ వచ్చింది. కానీ అదేమీ నిజం కాదు అని ఆతర్వాత అర్థం అయింది. ఇక ఇప్పుడు మొదటిసారి ఇటీవల జెమినీ టీవీలో ఆచార్య సినిమాను టెలికాస్ట్ చేయగా అతి తక్కువ స్థాయిలో రేటింగ్స్ అందుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

సీనియర్ హీరోలలో అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా మొదటిసారి ప్రసారమైనప్పుడు 14 టీఆర్పీ అందుకుంది. ఇక బాలకృష్ణ ‘అఖండ’ సినిమా 13.31 టీఆర్పీని అందుకుంది. ఆఖరికి వెంకటేష్ ‘ఎఫ్2’ సినిమా ఎనిమిదికి పైగా టీఆర్పీ రేటింగ్ అందుకోగా ఇప్పుడు ఆచార్య సినిమా అంత కంటే తక్కువ స్థాయిలో 6.30 టీఆర్పీ రేటింగ్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది ఆచార్య నుంచి వచ్చిన మరో షాక్ అని చెప్పచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్