Sunday, January 19, 2025
HomeTrending NewsTDP: ఆ ధీమాతోనే జగన్ అన్యాయం: అచ్చెన్న ఆరోపణ

TDP: ఆ ధీమాతోనే జగన్ అన్యాయం: అచ్చెన్న ఆరోపణ

సామాజిక న్యాయమే తెలుగుదేశం పార్టీ అని, ఈ పార్టీ పుట్టుకకు అదే మూల కారణమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు  అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ‘మాలల భాందవుడు చంద్రన్న’ పేరిట మంగళగిరిలోని  టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మాలల ఆత్మీయ సమావేశం జరిగింది, దీనికి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హారజయ్యారు. రాష్ట్రంలో కొన్ని వర్గాల వారి ఓట్లు తనకే పడతాయనే ధీమాతోనే సిఎం జగన్ అడ్డూ అదుపూ లేకుండా  అరాచకాలు  చేస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తాను 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, మాలల్లో ఇప్పుడున్న చైతన్యం  గతంలో ఎప్పుడూ చూడలేదని,  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబును సిఎం చేసి రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం వదలగొడతామని అందరూ ఆహ్వానిస్తున్నారని వివరించారు.

రాష్ట్రంలో దళితులపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా దళిత నేతలు సరిగా స్పందిచకపోవడం విచారకరమన్నారు. దళిత మంత్రులు జగన్ ను నిలదీస్తేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో తాము దళితులకు అమలు చేసిన ఎన్నో జగన్ రద్దు చేశారని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు.  సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నామని, అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకూ తగిన న్యాయం చేస్తామని చెప్పారు.

నారా లోకేష్ 138 రోజుల్లో 1800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, యాత్రకు అడ్డంకులు సృష్టించాలని ఎందరో ప్రయత్నాలు చేశారని కానీ సజావుగా ఇది ఓ సాహస యాత్రలా జరిగిందంటే దానిలో ప్రధాన భూమిక పోషించింది దళిత యువకులేనని, వారి భాగస్వామ్యం వల్లే యాత్ర దిగ్విజయంగా సాగుతోందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్