Saturday, January 18, 2025
Homeసినిమాయాక్షన్ సీన్స్ వరకూ ఓకే అనిపించినా 'ది ఘోస్ట్'

యాక్షన్ సీన్స్ వరకూ ఓకే అనిపించినా ‘ది ఘోస్ట్’

Mini Review:  మొదటి నుంచి కూడా నాగార్జున రొమాంటిక్ హీరో అనిపించుకోవడానికే  ఎక్కువ  ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. అనుకున్నట్టుగానే రొమాంటిక్ హీరో అనే ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ‘బంగార్రాజు’ వంటి  సినిమాలతోను ఆయన ఆ విషయాన్ని గుర్తుకు చేస్తూనే వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా యాక్షన్ సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నారు. అలా ‘ఆఫీసర్’ .. ‘వైల్డ్ డాగ్’ వంటి సినిమాల తరువాత ఆయన చేసిన మరో యాక్షన్ మూవీనే ‘ది ఘోస్ట్’. సునీల్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. ‘గాడ్ ఫాదర్’తో సమానంగా ఈ సినిమా పోటీకీ దిగడం విశేషం.

గతంలో ‘గరుడ వేగ’ వంటి యాక్షన్ సినిమాలతో మెప్పించిన ప్రవీణ్ సత్తారు, ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఇంటర్ పోల్ ఏజెంటుగా నాగార్జున కనిపిస్తారు. ఆయన సరసన నాయికగా సోనాల్ చౌహాన్ పాటలతో పాటు ఫైట్లలోను సందడి చేస్తుంది. మతపరమైన ఘర్షణల కారణంగా పదేళ్ల వయసులోనే అనాథగా మారిపోయిన హీరోను ఒక కల్నల్ చేరదీసి ప్రయోజకుడిని చేస్తాడు. ఆయన చనిపోయిన తరువాత ఆ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఆ ప్రమాదం నుంచి వాళ్లను ఇంటర్ పోల్ ఏజెంట్ విక్రమ్ ఎలా బయటపడేశాడనేదే కథ. ఇక్కడి నుంచి యాక్షన్ .. ఎమోషన్ కలిసే నడుస్తాయి.

కథాకథనాల పరంగా చూసుకుంటే .. గతంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. ఈ కథ విషయానికి వస్తే యాక్షన్ కనెక్ట్ అయినంతగా ఎమోషన్ కనెక్ట్ కాదు .. అదే లోపం. పైగా నాగార్జున .. సోనాల్ చౌహన్ .. అనిఖ సురేంద్రన్ మరో ఒకటికి రెండు పాత్రలను పక్కన పడితే, తెరపై అన్నీ కొత్త ముఖాలే కనిపిస్తూ ఉంటాయి. ఒకరి తరువాత ఒకరు విలన్ ప్లేస్ లోకి వస్తుంటారే తప్ప, బలమైన విలన్ లేకపోవడం మరో లోపంగా అనిపిస్తుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు .. మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆడియన్స్ ను మూడ్ లోకి తీసుకుని వెళుతుంది. ఇంటర్ పోల్ ఏజెంటుగా నాగార్జున ఓకే .. యాక్షన్ సినిమా కనుక యాక్షన్ సీన్స్  వరకూ ఓకే అనుకోవాలంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్