Saturday, January 18, 2025
Homeసినిమామహిళా కార్మికులకు అలీ కుటుంబం చేయూత

మహిళా కార్మికులకు అలీ కుటుంబం చేయూత

ప్రముఖ నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్‌ ప్రొడక్షన్‌ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లోని సభ్యులందరూ కరోనా కారణంగా షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిని ఎంతో కొంత ఆదుకునే ఉద్ధేశ్యంతో అలీ ముందుకు వచ్చి పదికిలోల బియ్యం, నూనె, గోదుమపిండి, చక్కెరలతో పాటు 8 రకాలైన సరుకులను వారికి అందించారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ ప్రతిరో జూ మేము షూటింగ్‌లకు వెళ్లే ముందే ఈ ప్రొడక్షన్‌ యూనియన్‌లోని ఆడవాళ్లు చాలా ముందుగా షూటింగ్‌ స్పాట్‌లకు వెళతారు. ఆ తర్వాత వీళ్లు షూటింగ్‌లో పని చేస్తూ మేమందరం తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ కష్ట సమయంలో షూటింగ్‌లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలిసింది. అందుకే ఈ రోజు నేను దాదాపు 2లక్షల రూపాయల ఖర్చుతో ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు అలీ. ఈ కార్యక్రమంలో నటుడు ఖయ్యూం, కరీమ్‌లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్