Saturday, January 18, 2025
Homeసినిమాఏమీ కాలేదు మహా ప్రభో : చంద్ర మోహన్

ఏమీ కాలేదు మహా ప్రభో : చంద్ర మోహన్

ఇటీవల 80 వసంతాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగుపెట్టారు సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌. తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో.. ఇక పై తాను సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పేశారు. అనారోగ్యం, కొవిడ్ కారణంగా తాను నటనకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గత కొన్నేళ్లలో ఎలా ఇబ్బంది పడిందీ తెలియచేశారు. ఇక పై సినిమాల్లో నటించకపోయినా.. ఎప్పుడూ ప్రేక్షకులకు తనను గుర్తు చేసేలా సినిమాలు ఎక్కడోచోట వస్తూనే ఉంటాయని చంద్రమోహన్ అన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని అస్వస్థతకు గురయ్యారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. కొంతమంది ఔత్సాహికులు అయితే.. ఆయన మరణించారని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్నా చంద్రమోహన్‌ వెంటనే స్పందించారు. ఈ మేరకు ఆయనొక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్నానని, తన ఆరోగ్యం పై వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలిపారు. పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. అభిమానుల ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష అని చంద్రమోహన్‌ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్