Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనాలుగు స్తంభాలాట

నాలుగు స్తంభాలాట

సందర్భం- 1
ఆయనకు ఒక పెళ్లి నిలవలేదు. రెండో పెళ్లి కుదరలేదు. మూడో పెళ్లికి విలువ ఇవ్వలేదు. నాలుగో బంధం ఎగతాళి కాదట. కానీ…తాళి కట్టలేదు.

సందర్భం- 2
ఆమెకు భర్త ఉన్నాడు. కానీ…భర్తతో లేదు. విడాకులు ఇవ్వలేదు. కానీ…విడిగానే ఉంటున్నారు.

సందర్భం-3
ఆమెకు ఇది మూడో పెళ్లి. సంప్రదాయంగా తాళి ఉంది. కొడుకు పుట్టాడు. కానీ భర్తతో గొడవలు. ఏడిపించిన మొగుడిని ఏడిపించాలన్న పట్టుదల ఉంది. టీ ఆర్ పి రేటింగుల పరుగు పందెం చానెళ్ల తోడు ఉంది.

విడాకులు ఇవ్వనప్పుడు ఆమె భార్యే; అతను ఆమె భర్తే. కానీ అతను విడాకులు ఇవ్వకుండానే…ఇంకో విడాకులు తీసుకోని ఆమెతో “భావోద్వేగపరమయిన మద్దతు” కోసం సహజీవనం చేయాల్సి వచ్చిందట.

ప్రస్తుత సందర్భం
నాలుగు స్తంభాలాట
పవిత్ర బంధం
పెళ్లాల పంచాయతీ
మైసూరులో మజా
లాంటి హెడ్డింగులతో వార్తలు తెరలు తెరలుగా ప్రసారమవుతుండగా…ఆయన విజిలేస్తున్నాడు. ఆమె చేతికి చెప్పు తీసుకుంది.

నాలుగో ఆమెకు అతని కుటుంబం మద్దతు ఉందట. మధ్యలో ఆమె భర్త అమాయకంగా అడుగుతున్నాడు…నా భార్య ఎక్కడుంది? అని.
భరించడం అన్నదే భార్య, భర్త మాటల వ్యుత్పత్తిలో ప్రధానమయిన అర్థం.

ఇందులో-
1. ఎందరు భార్యలు భరించారు?
2. ఎందరు భర్తలు భరించారు?
3. ఎందరు పిల్లలు భరించారు?
4. ఎంత సహజీవనం భరించింది?

Naresh

5. ఎంత తాళి ఎగతాళి అయ్యింది?
6. ఎవరిది బ్లాక్ మెయిల్?
7. ఎవరిది వైట్ మెయిల్?
8. నుదుటి మీద తుపాకి పెట్టి విడాకులు అడుగుతున్నా…నువ్వే నా భర్త అని ఆమె మంగళసూత్రాన్ని ఎందుకు కళ్ళకద్దుకుంటోంది?
9. ఈ నాలుగు స్తంభాలాటకు ముగింపు ఏమిటి?

అన్న ప్రశ్నలు అర్థం లేనివి. అర్థమయినా కానివి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

శుభం పలకరా పెళ్లి కొడకా…అంటే…!

RELATED ARTICLES

Most Popular

న్యూస్