Sunday, January 19, 2025
HomeసినిమాR. Narayana Murthy: గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి

R. Narayana Murthy: గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు,నటుడు,నిర్మాత ఆర్.నారాయణమూర్తి..

ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు.దేశవ్యాప్తంగా ఎందరినో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ పర్యవరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారని అన్నారు.సకాలంలో వర్షాలు కురవాలన్న,వాతావరణంలో మార్పులను అరికట్టాలన్న మొక్కలు నాటడం ద్వారానే సాధ్యమని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుండి వలసలు పోయేవారని కానీ నేడు తెలంగాణకు వలసలు పెరిగాయని అన్నారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందని ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు…

RELATED ARTICLES

Most Popular

న్యూస్