Saturday, January 18, 2025
Homeసినిమారాశి సింగ్ .. సక్సెస్ కోసమే వెయిటింగ్!

రాశి సింగ్ .. సక్సెస్ కోసమే వెయిటింగ్!

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పొలోమంటూ పరిచయమవుతున్నారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే ఆరంభంలో హిట్లు దొరుకుతూ ఉంటాయి. అలాంటివారినే అవకాశాలు ఎక్కువగా వెతుక్కుంటూ వస్తుంటాయి. ఇక మిగతావారు మాత్రం సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ, తమకి వచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. అలాంటి కథానాయికల జాబితాలో ‘రాశి సింగ్’ కూడా ఒకరుగా కనిపిస్తుంది. 2021లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అప్పటి నుంచి కూడా హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.

రాశి సింగ్ పరిచయమైన ఫస్టు మూవీ ‘శశి’. 2021లో విడుదలైన ఈ సినిమాకి శ్రీనివాస్ నాయుడు దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపంచింది. గ్లామర్ పరంగా రాశీకి వంకబెట్టవలసిన పనిలేదు. కానీ ఆ సినిమా యూత్ కి కనెక్ట్ కాలేకపోయింది. దాంతో రాశీ గురించి ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. అయినా తన ప్రయత్నాలు తను చేస్తూనే వెళ్లింది. అలా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఆ సినిమా ఫలితం కూడా ఆమెను నిరాశపరిచింది.

ఆ సినిమాలో ఆమె శివ కందుకూరి సరసన కనిపిస్తుంది. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ కి వచ్చి వెళ్లిందనేది కూడా చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలోనే ఆమెకి ‘ప్రేమ్ కుమార్’ సినిమాలో అవకాశం దొరికింది. ఈ సినిమాతో దర్శకుడిగా అభిషేక్ మహర్షి పరిచయమవుతున్నాడు. సంతోష్ శోభన్ జోడీగా ఈ సినిమాలో ఆమె కనిపించనుంది. హీరో పెళ్లికి సంబంధించిన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో తనకి హిట్ పడటం ఖాయమేననే నమ్మకంతో రాశి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్