Saturday, January 18, 2025
HomeసినిమాRashi Khanna: రాశి ఖన్నాకి కాలం కలిసి రావలసిందే!  

Rashi Khanna: రాశి ఖన్నాకి కాలం కలిసి రావలసిందే!  

రాశి ఖన్నా తన కెరియర్ ను మొదలుపెట్టేసి పదేళ్లు అయింది. కెరియర్ ను ఆరంభించిన కొత్తలో చకచకా అవకాశాలను అందుకుంటూ వెళ్లింది. అందుకు తగినట్టుగానే కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆరంభంలో రాశి ఖన్నా అభినయాన్ని గురించి ఎవరూ కూడా అంతగా పట్టించుకోలేదు. అందుకు కారణం ఆమె గ్లామర్. గులాబి రంగు మేనిఛాయతో మెరిసిపోతూ తెరపై జారిపోతున్న రాశి ఖన్నాను చూస్తూ కుర్రాళ్లంతా అలా ఉండిపోయారు. ఆమె అభిమానులుగా మారిపోయారు.

బొద్దుగా కనిపిస్తూ .. క్యూట్ గా అనిపిస్తూ ఆమె యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. నిదానమే ప్రధానమన్నట్టుగా చాలా కాలం పాటు వచ్చిన అవకాశాలను మాత్రమే చేస్తూ వెళ్లింది. ఆ తరువాత గ్లామర్ గా కనిపించే విషయంలో రెండు అడుగులు ముందుకు వేసింది. అయితే అప్పటికే జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది. కొత్త కథానాయికలు ఆమె కంటే ముందుగానే దూసుకుపోయారు. దాంతో రాశి ఖన్నా ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది.

ఈ మధ్య కాలంలో రాశి ఖన్నా చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ‘పక్కా కమర్షియల్’ .. ‘థ్యాంక్యూ’ వంటి సినిమాలు ఆమెను ఈ కష్టం నుంచి బయటపడేయలేక పోయాయి. గతంలో ఆమె ఒప్పుకున్న ప్రాజెక్టులు తప్ప ఆమె చేతిలో కొత్త ప్రాజెక్టులు లేవు. చర్చల దశలో ఏమైనా ఉన్నాయేమో తెలియదు. తమన్నా కాస్త ఒళ్లు చేసి .. సీనియర్ స్టార్ హీరోల సరసన బిజీ అవుతోంది. అలా కాకుండా రాశి ఖన్నా మరింత సన్నబడిపోయి అవకాశాల కోసం వెయిట్ చేస్తుండటం విచిత్రమే. కాలం కలిసొచ్చి రాశి ఖన్నా పుంజుకుంటుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్