Saturday, January 18, 2025
HomeసినిమాSakshi Vaidya: సాక్షి వైద్య మరో ఛాన్స్ కోసం వెయిట్ చేయవలసిందే! 

Sakshi Vaidya: సాక్షి వైద్య మరో ఛాన్స్ కోసం వెయిట్ చేయవలసిందే! 

బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన తరువాత టాలీవుడ్ కి వచ్చిన ముంబై భామలు కొందరైతే, ముంబైలో మోడలింగ్ కెరియర్ ను ఆరంభించి అక్కడి నుంచి టాలీవుడ్ కి వచ్చిన బ్యూటీలు కొందరు. అలాంటి హీరోయిన్స్ లో సాక్షి వైద్య ఒకరు. మహారాష్ట్రకి చెందిన ఈ సుందరి, మోడలింగ్ లో పుంజుకుంటున్న సమయంలోనే సినిమాలపై దృష్టి పెట్టింది. ఫలితంగా తెలుగులో ‘ఏజెంట్’ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. స్టార్ డైరెక్టర్ .. అఖిల్ వంటి క్రేజీ హీరో జోడీగా ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

‘ఏజెంట్’ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. పబ్లిసిటీ కూడా ఒక రేంజ్ లో చేశారు. ఈ సినిమాలో సాక్షి గ్లామర్ కి పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అక్కడక్కడా అలా అందంగా మెరిసిందంతే. అయితే ఆ సినిమాపై ఆమె పెట్టుకున్న భారీ ఆశలు ఆవిరైపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ సినిమా కంటెంట్ పరంగా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. దాంతో సాక్షి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ సినిమా షూటింగు సమయంలోనే ఆమె ‘గాండీవధారి అర్జున’ ఒప్పుకోవడం జరిగింది.

ఇది కూడా చిన్నా చితకా సినిమా ఏం కాదు. భారీ బడ్జెట్ తో .. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చింది. వరుణ్ తేజ్ సరసన ఆమె చేసిన ఈ సినిమా కాస్త గట్టి అంచనాలతోనే థియేటర్లకు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో జనంలోకి వెళ్లలేకపోయింది. ఈ సినిమాలో యాక్షన్ ఒక్కటి మాత్రమే కాదు, దాని చుట్టూ చాలా ఉన్నాయని వరుణ్ తేజ్ చెప్పాడు. కానీ అవేమీ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఈ సినిమాలో కూడా సాక్షి పెద్దగా చేసిందేమీ లేదు. ఫలితంగా మళ్లీ ఆమెకి నిరాశనే మిగిలింది. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉంది .. అలాంటి ఒక ఛాన్స్ కోసమే వెయిట్ చేయాలంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్