Sunday, January 19, 2025
HomeసినిమాSakshi Vaidya: పాపం .. సాక్షి వైద్యను వేధిస్తున్న ఫ్లాప్!

Sakshi Vaidya: పాపం .. సాక్షి వైద్యను వేధిస్తున్న ఫ్లాప్!

సాక్షి వైద్య .. మోడలింగ్ రంగంలో బిజీగానే ఉంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలను ఎక్కువగా చూస్తూ పెరిగింది. అందువలన అక్కడి సినిమాల ప్రభావం ఆమెపై ఎక్కువగా ఉంది. బాలీవుడ్ సినిమాలతోనే ఆమె ఇండస్ట్రీకి పరిచయం కావాలని అనుకుంది. బాలీవుడ్ లో కూడా భారీ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ ఈ సమయంలోనే ‘ఏజెంట్’ సినిమాలో ఆమెకి ఛాన్స్  వచ్చింది.

తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచస్థాయిలో ముందుకు వెళుతోంది. అందువలన పెద్ద బ్యానర్లో గట్టి  తెలుగు సినిమా ఒకటి చేస్తే చాలు అనుకునే హీరోయిన్స్ రంగంలోకి దిగుతున్నారు. అలాగే సాక్షి కూడా ఈ ఒక్క సినిమాతో ఇతర భాషల్లోను పరిచయం కావచ్చనే ఉద్దేశంతో ‘ఏజెంట్’ సినిమాను ఒప్పుకుంది. ఈ సినిమాలో పాత్ర పరంగా చూసుకుంటే ఆమె పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. తెరపై మాత్రం గ్లామరస్ గా మెరిసింది. ముఖ్యంగా ఆమె నాజూకుదనానికీ .. నవ్వుకు ఎక్కువ మార్కులు పడిపోయాయి.

అయితే ఆమె ఇంతగా ఆశలు పెట్టుకుని … అంచనాలు వేసుకున్న ఈ సినిమా, తొలి రోజునే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పెద్ద బ్యానర్ .. హీరో కంటెంట్ పుష్కలంగా ఉన్న అఖిల్  కాంబినేషన్ .. స్టార్ డైరెక్టర్ .. ఇతర భాషల్లోని ఆడియన్స్ కి తెలిసే ఛాన్స్ .. ఇలా సాక్షి వేసుకున్న లెక్కలు కరెక్టుగానే ఉన్నాయి. కానీ కథాకథనాల పరంగా ఈ సినిమా తేడా కొట్టేసింది. ఇలాంటి రిజల్ట్ వలన  సాక్షి డీలాపడటం ఎంత సహజమో, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉండటం కూడా అంతే సహజం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్