Sunday, January 19, 2025
Homeసినిమాటాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన సన్యా ఠాకూర్!

టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన సన్యా ఠాకూర్!

టాలీవుడ్ లో హీరోయిన్స్ కి లభించే గుర్తింపు .. గౌరవం వేరు. సౌత్ లో హీరోయిన్స్ కి ఎక్కువ పారితోషికం లభించేది కూడా ఇక్కడే. ఇప్పుడు తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అందువలన కొత్త కథానాయికలు తెలుగు సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఆల్రెడీ ఇతర భాషల్లో ఎంట్రీ ఇచ్చినవారు, టాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. గడిచిన 6 నెలలలో చాలామంది కొత్త కథానాయికలు తెలుగు తెరపైకి వచ్చారు.

అలాంటి కథానాయికలలో ఒకరిగా ‘సన్యా ఠాకూర్’ కనిపిస్తుంది. ఈ బ్యూటీ ‘స్పై’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా ఐశ్వర్య మీనన్ కనిపించగా, ముఖ్యమైన పాత్రలో సన్యా ఠాకూర్ మెరిసింది. ‘స్పై’ పాన్ ఇండియా సినిమా .. అందువలన ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆమె భావించింది. అందువలన చిన్న పాత్రనే అయినా అంగీకరించింది. చిన్న పాత్రనే అయినా, ఆ నిడివిలోనే ఆకట్టుకునేవి కొన్ని ఉంటాయి. ఆమె పోషించింది అలాంటి పాత్ర కాకపోవడమే మైనస్ అయింది.

ఈ సినిమా తరువాత సన్యా ఠాకూర్ గురించి ఎవరూ మాట్లాడుకోకపోవడానికి కారణం, ఆమె ఎంచుకున్న ఆ పాత్రనే. నిఖిల్ తో ఆమె రొమాన్స్ లేకపోవడం .. పాటలు లేకపోవడం వలన అసలు ఆ పాత్ర రిజిస్టర్ కాలేదు. అందువలన ఈ సారి చేయనున్న సినిమాలో అందరికీ గుర్తుండిపోయే పాత్రనే చేయాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్టుగా టాక్. యంగ్ హీరోల కొత్త ప్రాజెక్టులలో ఛాన్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తోందని అంటున్నారు. ఆమె ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్