Sunday, January 19, 2025
Homeసినిమాప్రతి ఒక్కరు మెచ్చే 'ఇద్దరు'- సోని చరిష్టా

ప్రతి ఒక్కరు మెచ్చే ‘ఇద్దరు’- సోని చరిష్టా

అర్జున్, రాధికా కుమారస్వామి, సోని చరిష్టా హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ‘ఇద్దరు’. ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో యువ ప్రతిభాశాలి ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 7న  ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జె.డి.చక్రవర్తి, ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

సోని చరిష్టా మాట్లాడుతూ…. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సమీర్ గారికి నా కృతజ్ఞతలు. యాక్షన్ కింగ్ అర్జున్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. “ఇద్దరు” అనే ఈ చిత్రం నా కెరీర్ లో ఓ మైలురాయి. చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నిర్మాత “ఫర్హీన్ ఫాతిమా”లకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటన్నాను అన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్