Shooting wrapped: యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మహాశివరాత్రికి ప్రత్యేక ఆకర్షణగా ఫిబ్రవరి 25న రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో శర్వానంద్ తన ఆన్-స్క్రీన్ భార్యకు నమస్కరిస్తున్నట్లు కనిపిస్తోంది. రష్మిక మందన్నతో పాటు ఇతర ప్రధాన తారాగణం అందరూ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్ ఈ సినిమా ఇతివృత్తాన్ని తెలియజేసేలా ఉంది. శర్వా హావభావానికి చాలా మంది మహిళలు అందమైన చిరునవ్వుతో మెరుస్తున్నట్లు పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం టైటిల్ సాంగ్, టీజర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచేశారు మేకర్స్. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది.
వాలెంటెన్స్ డే కానుకగా దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఆద్య పాటను ఈ రోజు విడుదల చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ యాక్టర్స్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాలో మరో విశేషం. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.