Title fixed?: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తెలుగులో చేస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమా పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అసలు ఈ సినిమా కథ ఏంటి..? రామ్ చరణ్ పాత్రను పవర్ ఫుల్ గా ఎలా చూపించబోతున్నారు..? అనేది ఆసక్తిగా మారింది.
ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. వచ్చేనెల 2వ వారం నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలెట్టనున్నట్టు చెబుతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే… ఈ సినిమా కోసం మూడు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో ఇప్పుడు అధికారి అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు కనుక, అధికారి అనే టైటిల్ కరెక్టుగా సెట్ అవుతుందని అంటున్నారు.
ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ముఖ్యమైన పాత్రలలో శ్రీకాంత్, సునీల్, అంజలి కనిపించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు చెబుతున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే అధికారి అనే టైటిల్ ని కన్ ఫర్మ్ చేశారా లేదా అనేది తెలియాల్సివుంది.
Also Read : చరణ్, శంకర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్