రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ‘రంగస్థలం’ సినిమాలో తన సహచర నటుడు ‘శత్రువు’ (విలన్ పాత్ర) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటారు ప్రముఖ హీరో ఆది పినిశెట్టి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ… “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం, సోషల్ మీడియాలో మనం వివిధ రకాల చాలెంజ్ లు చూస్తూ ఉన్నామని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఛాలెంజ్ అని అన్నారు.
‘మనం రోజూ చూస్తున్నాం.. వాతావరణ కాలుష్యం ఏ విధంగా తయారవుతుందో దీన్ని సంరక్షించాలి అంటే మనందరం బాధ్యతగా మొక్కలు నాటాల”ని కోరారు. సెలబ్రిటీస్ ద్వారా ఇది ప్రజల్లోకి వెళితే ఇంకా అద్భుతంగా విజయం సాధిస్తుందన్న ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందు తీసుకెళ్లడం చాలా సంతోషకరమైన విషయమని అభినందనలు తెలిపారు. నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చిన నా సహచర నటుడు శత్రువుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ఛాలెంజ్ విధంగా ముందుకు కొనసాగాలని అందుకోసం నేను నా సహచర నటుడు అయిన మిథున్ చక్రవర్తి, ఆకాంక్ష సింగ్, నిక్కీ గల్ రాణి , రాహుల్ రవీంద్ర లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్ వృక్ష వేదం పుస్తకాన్ని ఆది పినిశెట్టికి అందజేశారు.