Sunday, January 19, 2025
Homeసినిమా'ఆదిపురుష్' ఇప్పట్లో రానట్లే?

‘ఆదిపురుష్’ ఇప్పట్లో రానట్లే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆది పురుష్’. రామాయణం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తే.. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతగా నటిస్తుంది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించారు. ఆమధ్య ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశారు. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా ఆదిపురుష్ గ్రాఫిక్స్ సరిగా లేవని టాక్ రావడంతో మేకర్స్ క్వాలిటీ ఫిల్మ్ అందించేందుకు మరోసారి గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు.

దీంతో 2023 సంక్రాంతికి రావాలి అనుకున్న ఆదిపురుష్‌ వాయిదాపడింది. ప్రస్తుతం ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీ రిలీజ్ వాయిదాపడడంతో ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే వర్క్ లో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ మూవీని జూన్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే… ఇప్పుడు జూన్ లో కూడా ఆదిపురుష్ రావడం కష్టమే అని టాక్ వినిపిస్తోంది. ఆదిపురుష్ కంటే ముందు సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల ప్రాజెక్ట్ కే మూవీకి సంబంధించి పెద్ద షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ మూవీని కూడా త్వరగా విడుదల చేయాలి అనుకుంటున్నారట.

సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతితో చేస్తున్న మూవీ షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ లెక్కన ఆదిపురుష్ వచ్చే సంవత్సరంలో కూడా రిలీజ్ కాదని.. 2024 సంక్రాంతికి విడుదల అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో ప్రబాస్ నటిస్తున్న సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి..? ఎప్పుడు రిలీజ్ అవుతాయి..? అనేది క్లారిటీ లేదు. సలార్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మరి.. ప్రకటించినట్టుగా సెప్టెంబర్ లోనే వస్తుందో లేదో చూడాలి.

Also Read : ‘హనుమాన్’ రాకతో మళ్లీ వార్తల్లో నిలిచిన ‘ఆదిపురుష్‌’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్