Sunday, January 19, 2025
Homeసినిమాఆదిపురుష్ ఎఫెక్ట్ ఎన్టీఆర్ మూవీ పై పడిందా..?

ఆదిపురుష్ ఎఫెక్ట్ ఎన్టీఆర్ మూవీ పై పడిందా..?

ప్రభాస్ ‘ఆదిపురుష్‘ మూవీ టీజర్ ను ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ కు కొంచెం పాజిటీవ్ రెస్పాన్స్ కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆలోచనలో పడిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై మరికాస్త సీరియస్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. భారతదేశం గర్వించదగ్గ సినిమాగా రూపొందించాలని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ వాయిదా వేసి మరీ రీ వర్క్ చేస్తున్నారు. దీని వలన అదనంగా 100 కోట్ల భారం పడుతుందని తెలిసినా మేకర్స్ క్వాలిటీ కోసం తపిస్తుండడం అభినందించదగ్గ విషయం.

అయితే… ఆదిపురుష్ రిలీజ్ వాయిదా వేయడంతో ‘సలార్’ తో పాటు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటంటే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 28న విడుదల చేయాలని ఫిక్సయ్యాడు. డేట్ ని కూడా ప్రకటించి ఇందుకు తగ్గట్టుగా షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నాడు కూడా. అనుకున్న సమయానికి సలార్ సినిమాను పూర్తి చేసి వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడట. ఆది పురుష్ రిలీజ్ డేట్ మారడంతో పాటు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

సలార్ రిలీజ్ ని మరో సారి మార్చే అవకాశాలు వున్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఆలస్యంగా పట్టాలెక్కనుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ తో కొరటాల మూవీ తరువాత ప్రశాంత్ నీల్ భారీ పాన్ ఇండియా మూవీని తెర పైకి తీసుకురావాలని అనుకున్నారు. ఇప్పడు ఆ ప్లాన్ ఆదిపురుష్ రిలీజ్ డేట్ మార్పుతో పూర్తిగా మారినట్టుగా తెలుస్తోంది. మరి.. ప్రశాంత్ నీల్ సలార్ డేట్ కూడా మారుస్తాడా..? ఎన్టీఆర్ మూవీని మరింత ఆలస్యం చేస్తాడా..? లేక ఆదిపురుష్ తో సంబంధం లేకుండా అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ మూవీని స్టార్ట్ చేస్తాడా అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్