Wednesday, June 26, 2024
HomeసినిమాAdipurush Movie Sita Look: 'ఆదిపురుష్' నుంచి కృతి సనన్ పోస్టర్ రిలీజ్

Adipurush Movie Sita Look: ‘ఆదిపురుష్’ నుంచి కృతి సనన్ పోస్టర్ రిలీజ్

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే.. భారత ఇతిహాసాల్లోనే అత్యంత గౌరవించదగిన మహిళా సాథ్వి సీత. అయితే.. సీతా నవమి సందర్బంగా అంకితభావం, నిస్వార్థత, శౌర్యం మరియు స్వచ్ఛతకు ప్రతిరూపం అయిన జానకి మంత్రముగ్ధమైన రూపంతో ఉన్న మోషన్ పోస్టర్‌ తో పాటు.. ‘రామ్‌ సియా రామ్‌’ ఆడియో టీజర్‌ ను కూడా విడుదల చేశారు.

రామ్ సియా రామ్ ట్యూన్ జానకికి రాఘవ పట్ల ఉన్న అచంచలమైన భక్తిని తెలియజేసేలా ఉంది. ఈ పాట ప్రేక్షకులను ఆధ్యాత్మికత, భక్తి ప్రపంచానికి తీసుకువెళుతుంది. ఈ గీతాన్ని సచేత్-పరంపర స్వరపరిచారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టి-సిరీస్ భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రోఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ తో పాటు యు వి క్రియేషన్స్ ప్రమోద్, వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్