ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓంరౌత్ డైరెక్టర్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన మూవీ పై రిలీజైనప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. రాముడుగా ప్రభాస్ మీసాలు పెట్టుకోవడం పై విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని హనుమాన్ డైలాగులు, రావణ్ ను చూపించిన విధానం.. ఇలా ఒకటేమిటి చాలా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ మొదటి మూడు రోజులు భారీగా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు 140 కోట్లు, రెండో రోజు 100 కోట్లు, మూడవ రోజు 100 కోట్లు కలెక్ట్ చేసింది.
సోమవారం నుంచి కలెక్షన్స్ బాగా తగ్గాయి. ఇప్పటి వరకు 395 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే… కలెక్షన్స్ బాగా తగ్గిపోవడంతో మేకర్స్ ఆదిపురుష్ 3డి వెర్షన్ టిక్కెట్ ధరలు రాబోయే రెండు రోజులకు 150 రూపాయలకు పరిమితం చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో వర్తించదు. మేకర్స్ హిందీ బెల్ట్‌ను మాత్రమే లక్ష్యంగా దీనిని ప్రకటించారు. అయితే.. వీక్ డేస్ లో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఇదో మంచి స్ట్రాటజీ అంటున్నారు విశ్లేషకులు.
అలానే ఇక పై మూవీలో డైలాగ్స్‌ని ఎడిట్ చేసి మార్చుతామని టీమ్ గతంలో చెప్పింది. ఈ మూవీలో హనుమంతుడి క్యారెక్టర్‌లో డైలాగ్స్ పై కొంత విమర్శలు రావడంతో వారు ఈ సవరణ చేయడం జరిగింది. ఈ వారం చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేవు. అందుచేత ఆదిపురుష్ కు ఈ వారం బాగా కలిసొస్తుందని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. ఆదిపురుష్ మేకర్స్ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుంది..? కలెక్షన్స్ పెరుగుతాయా..? పెరిగితే ఏం రేంజ్ లో పెరుగుతాయి..? అనేది చూడాలి.