Sunday, January 19, 2025
Homeసినిమా'ఆదిపురుష్' పోస్టర్ రిలీజ్

‘ఆదిపురుష్’ పోస్టర్ రిలీజ్

ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తే.. కృతి సనన్ సీతగా నటిస్తుంది. సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నారు. రామ నవమి శుభ సందర్భంగా.. మేకర్స్ ఆదిపురుష్ కొత్త పోస్టర్ తో ఒక విధంగా సర్ ప్రైజ్ చేసారని చెప్పాలి. ఈ పోస్టర్ ని ఓంరౌత్ అండ్ టీమ్ ఎంతో కేర్ తీసుకుని రూపొందించారు.అలాగే ఈ పోస్టర్ లోనే ఆదిపురుష్ విడుదల తేదీ 16 జూన్ 2023 అంటూ మరోసారి క్లారిటీనిచ్చింది చిత్రబృందం.

కొత్త పోస్టర్ లో ప్రభాస్- కృతి సనన్- సన్నీ సింగ్ .. ఆంజనేయుడు పాత్రధారి దేవాదత్తా ఉన్నారు. ఆదిపురుష్ కొత్త పోస్టర్ ను షేర్ చేస్తూ- మంత్రోన్ సే బధ్కే తేరా నామ్ జై శ్రీరామ్! అని ప్రభాస్ రాశాడు. సీత పాత్రధారి కృతి సనోన్ సహా ఇతర చిత్రబృందం ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. రామనవమి శ్లోకాల ప్రతిధ్వని నడుమ ఆదిపురుష్ నిర్మాతలు అద్భుతమైన పోస్టర్ ను విడుదల చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. టి-సిరీస్ భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్- ఓం రౌత్- ప్రసాద్ సుతార్ -రెట్రోఫైల్స్ కు చెందిన రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్