Saturday, January 18, 2025
Homeసినిమాఅమీర్ ఖాన్ కోసం ‘ఆది పురుష్’ వాయిదా

అమీర్ ఖాన్ కోసం ‘ఆది పురుష్’ వాయిదా

Adipurush Postponed: బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రీనా క‌పూర్ హీరోయిన్‌. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆత‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆ త‌ర్వాత ఏప్రిల్ 14న రిలీజ్ అని ప్ర‌క‌టించారు. ఇలా వాయిదాలు ప‌డిన లాల్ సింగ్ చ‌ద్దా మ‌రోసారి వాయిదా ప‌డింది.

తాజాగా లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అందుకు కారణం అనుకున్న స‌మయానికి సినిమాను పూర్తి చేయ‌లేక‌పోవ‌డ‌మేనని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. మ‌రి అదే రోజున ప్ర‌భాస్, ఓం రౌత్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ‘ఆది పురుష్’ సినిమా రిలీజ్ ఉందిగా అనే సందేహం రాక మాన‌దు. అయితే ‘ఆది ప‌రుష్’ ‘లాల్ సింగ్ చద్దా’ కోసం వాయిదా ప‌డింది. త‌మ కోసం ఆది పురుష్ సినిమాను వాయిదా వేసుకున్న మేక‌ర్స్‌ కు అమీర్ ఖాన్ అండ్ టీమ్ థాంక్స్ చెబుతూ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

Also Read : చైతన్య చాలా మంచి మ‌నిషి : అమీర్ ఖాన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్