Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్స్కాట్లాండ్ పై ఆఫ్ఘన్ ఏకపక్ష విజయం

స్కాట్లాండ్ పై ఆఫ్ఘన్ ఏకపక్ష విజయం

టి­-20 వరల్డ్ కప్ సూపర్-12లో నేడు జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ 130 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆఫ్ఘన్ బౌలర్ ముజీబుర్ రెహ్మాన్ ఐదు వికెట్లతో రాణించి స్కాట్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ తీశాడు. రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ నబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నజీబుల్లా జడ్రాన్ 35 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లతో 59; ఓపెనర్ హజ్రతుల్ల్లా జజాయ్ 30 బంతుల్లో 3ఫోర్లు 3సిక్సర్లతో44; రహ్మతుల్లా గుర్బాజ్ 37 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సర్లతో 46; చివర్లో కెప్టెన్ నబీ కేవలం 4 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ రెండు, జోష్ డేవీ, మార్క్ వాట్ చెరో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన స్కాట్లాండ్ కు నాలుగో ఓవర్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఫ్ఘన్ బౌలర్ ముజీబుర్ రెహ్మాన్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు.  ఆ తర్వాత స్కాట్లాండ్ ఇక కోలుకోలేదు, ఓవర్ కు ఒక వికెట్  చొప్పున కోల్పోయింది. ముజీబుర్ ఆరో ఓవర్లో, ఎనిమిదో ఓవర్లో కూడా రెండు వికెట్లు తీసి మొత్తం ఐదు వికెట్లతో రాణించాడు.  రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు రాబట్టాడు. నవీన్ ఉల్ హక్ కు మరో వికెట్ దక్కింది. స్కాట్లాండ్ ఆటగాళ్ళలో ఐదుగురు డకౌట్ కావడం విశేషం. కేవలం ముగ్గురు మాత్రమే… ఓపెనర్ జార్జ్ మున్షీ (25); కైల్ కొయెట్జర్ (10); క్రిస్ గ్రీవ్స్ (12) మాత్రమే రెండంకల స్కోరు దాటారు. దీనితో 10.2 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ముజీబుర్ రెహ్మాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్