with Proofs: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థలకు సంబంధం ఉందని, అందుకే నారాయణను అరెస్టు చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం వైఫల్యం చెందిదని, మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న నారాయణను అరెస్ట్ చేస్తే అన్యాయం, అక్రమం అని గగ్గోలు పెడతారని విమర్శించారు.
తిరుపతిలో ఉన్న నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ ను అరెస్టు చేసి విచారించి, వారి వాంగ్మూలం తీసుకున్న తర్వాతే ఈ అరెస్ట్ జరిగిందన్నారు అంబటి. పేపర్లు లీక్ చేసి డబ్బులు సంపాదించవచ్చు, కానీ అరెస్టు చేస్తే మాత్రం తప్పా అని ప్రశ్నించారు. నారాయణ నంబర్ వన్ అంటూ ప్రకటనలు ఇస్తుంటారని, పేపర్లు లీక్ చేస్తుంటారు కాబట్టే ఈ ఫలితాలు వస్తున్నాయని అనుకోవాల్సి వస్తోందన్నారు. ఇలాంటి స్కామ్ లు చేసి విద్యనూ వ్యాపారం చేస్తోన్న నారాయణను ఆధారాలతో సహా అరెస్టు చేస్తే ఎందుకు యాగీ చేస్తున్నారని అడిగారు.
నారాయణను ఎప్పటినుంచో అరెస్టు చేయాలని చూస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ‘నారాయణ ఏమైనా గొప్పోడా.. ఆ మాటకొస్తే బాబునే అరెస్ట్ చేస్తాముగా’ అని ఎద్దేవా చేశారు.
Also Read : చట్టం తన పని చేసుకుపోతుంది: బొత్స