Saturday, January 18, 2025
Homeసినిమాబ‌న్నీ, త్రివిక్ర‌మ్ మూవీ ఫిక్స్?

బ‌న్నీ, త్రివిక్ర‌మ్ మూవీ ఫిక్స్?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో  వచ్చిన  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. సూపర్ హిట్లు గా నిలిచారు. ఈ కంబోలో మరో సినిమా ఉంటుందని కొన్ని నెలల క్రితమే వార్తలు వచ్చాయి.  ఇటీవల ఇరువురి మధ్య భేటీ జరిగిందని.. ఈ సందర్భంగా కథ గురించి చర్చలు జరిగాయని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా పూర్తైన‌ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 లో నటిస్తున్నారు.  పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే లోపు.. త్రివిక్రమ్ SSMB28 సినిమాని కంప్లీట్ చేయడమే కాదు.. బన్నీ స్క్రిప్ట్ కూడా పూర్తి చేస్తార‌ట‌.

అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత అనేక మంది స్టార్ డైరెక్ట‌ర్స్ తో అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖ దర్శకులు స్టోరీలు వినిపించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. బన్నీ వీరి కంటే ముందు త్రివిక్రమ్ సినిమాని చేస్తాడని వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ త‌ర్వాత  బ‌న్నీ చేయబోయే సినిమాల ప్ర‌క‌ట‌న దసరాకు ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.

Also Read: ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ కి అల్లు అర్జున్

RELATED ARTICLES

Most Popular

న్యూస్