Saturday, January 18, 2025
Homeసినిమావారియర్ దెబ్బకు ప్లాన్ మార్చుకున్న రామ్?

వారియర్ దెబ్బకు ప్లాన్ మార్చుకున్న రామ్?

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ‘ది వారియ‌ర్‘ తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాపై రామ్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలై  అంచ‌నాలు ఏమాత్రం అందుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. తమిళ, తెలుగు భాషల్లో మెప్పించలేక‌పోయింది. దీంతో రామ్ ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. నెక్ట్స్ చేయ‌బోయే సినిమాల విష‌యంలో మార్పులు చేర్పులు చేస్తున్నాడ‌ట.

మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీనుతో రామ్ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇప్పుడు వారియ‌ర్ మూవీ లెక్క‌లు చూసుకున్న త‌ర్వాత బోయ‌పాటి మూవీకి బ‌డ్జెట్ త‌గ్గించాలి అనుకుంటున్నార‌ట‌. అలాగే పాన్ ఇండియా మూవీ చేయాలా..?  తెలుగులోనే రిలీజ్ చేయాలా..? అని కూడా ఆలోచిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఈ మూవీ త‌ర్వాత గౌత‌మ్ మీన‌న్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ను కేవలం కోలీవుడ్ ఆడియెన్స్  ను టార్గెట్ పెట్టుకుని ఫిక్స్ చేయాలనుకున్నాడు కానీ.. ది వారియర్ రిజల్ట్ చూసిన తర్వాత కోలీవుడ్ కు కాస్త బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట. గౌతమ్ మీనన్ కంటే ముందుగా  అనిల్ రావివూడితో మూవీ చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాడట. బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా త‌ర్వాత‌ రామ్ మూవీ చేసే ఛాన్స్ ఉంద‌ని టాక్. మొత్తానికి ది వారియ‌ర్ ఎఫెక్ట్ రామ్ పై బాగానే ప‌డింది.

Also Read : లింగుస్వామికి బ‌న్నీ, మ‌హేష్ నో చెప్పారా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్