Saturday, January 18, 2025
Homeసినిమామళ్ళీ నాగార్జునే బిగ్ బాస్

మళ్ళీ నాగార్జునే బిగ్ బాస్

తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ నాలుగు సీజన్ లు సక్సస్ ఫుల్ గా పూర్తయ్యాయి. ఒక సీజన్ కు మించి మరో సీజన్ సక్సస్ సాధించడంతో బిగ్ బాస్ పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఏర్పడింది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ కానుంది. దీంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ 5లో ఎవరెవరు పాల్గొంటారు..? ఈసారి కూడా వ్యాఖ్యాతగా కింగ్ నాగార్జునే ఉంటారా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. బిగ్ బాస్ 5 కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఈ సీజన్ ను సమ్మర్ లో స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కార‌ణంగా, ఈ సీజ‌న్‌ను స్టార్ట్ చేయ‌లేదు. ఇప్పుడు ఐదో సీజ‌న్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నార‌ని తెలిసింది. అందులో భాగంగా ఇప్ప‌టికే అందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్‌ను జూమ్ ద్వారా ఇంట‌ర్వ్యూ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వారం ప‌ది రోజుల్లో ఫైన‌ల్ కంటెస్టెంట్స్‌ను ఖ‌రారు చేస్తారు. ఆతర్వాత వారిని క్వారంటైన్‌లో ఉంచి త‌ర్వాత సీజ‌న్‌ను స్టార్ట్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. మరో విషయం ఏంటంటే… ఈసారి ప్రైజ్ మనీ భారీగా ఉంటుందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్