Sunday, January 19, 2025
Homeసినిమా'ఏజెంట్'.. పై మళ్లీ అనుమానాలు

‘ఏజెంట్’.. పై మళ్లీ అనుమానాలు

అఖిల్ నటించిన నాలుగు చిత్రాల్లో మూడు చిత్రాలు నిరాశపరిచాయి. నాలుగవ చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీ ఆకట్టుకోవడంతో తొలి విజయం సాధించాడు. ఈ సినిమా తర్వాత భారీ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్‘ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అఖిల్ కు జంటగా సాక్షి వైద్య నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఎన్నో సార్లు వాయిదాపడిన ఏజెంట్ చిత్రాన్ని ఇప్పుడు ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

అయితే.. ఏజెంట్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సింగిల్ బాగానే ఆకట్టుకుంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతుంది. అయితే.. ఈ సినిమా రిలీజ్ కి గట్టిగా నెల రోజులే ఉంది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు కానీ.. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనౌన్స్ మెంట్ లేదు. మరో వైపు అఖిల్ సీసీఎల్ క్రికెట్ లీగ్ అంటూ క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నాడు. దీంతో ఏజెంట్ మూవీ పై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. 40 కోట్లతో ఈ సినిమాను తీయాలి అనుకున్నారు అది కాస్తా.. 80 కోట్లు అయ్యింది.

బడ్జెట్ బాగా పెరిగినప్పటికీ.. నిర్మాత కాస్త కూల్ గా ఉండడానికి కారణం.. ఈ చిత్రాన్ని హోల్ సేల్ గా అమ్మేయడమే. అయితే.. రిటైల్ అమ్మకాలు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెక్కుతూనే ఉన్నాడు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయట. దీంతో నిర్మాత అనిల్ సుంకర అనౌన్స్ చేసిన టైమ్ కి రిలీజ్ చేయడం అవుతుందా..? లేదా అని టెన్షన్ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అభిమానులు మాత్రం ఏజెంట్ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి… ఏజెంట్ ఏం చేస్తాడో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్