అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్‘. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వచ్చిన ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో పాటు ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఏజెంట్ మూవీ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే.. ఏజెంట్ కు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదురవుతుంది.
ఇలాంటి ప్యాన్ ఇండియా గ్రాండియర్లకు వీలైనంతగా పోటీ లేని సోలో రిలీజ్ చాలా అవసరం కానీ ఏజెంట్ కు అంత ఈజీ వెల్కమ్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 2’ కూడా ఏప్రిల్ 28నే వస్తుంది. ఈ డేట్ ను మేకర్స్ ఎప్పుడో లాక్ చేశారు. ఫస్ట్ పార్ట్ తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. అసలు కథ, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ పార్ట్ 2లోనే ఉంటాయని యూనిట్ మొదటి నుంచి ఊరిస్తోంది. సో ఫస్ట్ పార్ట్ తెలుగులో గొప్పగా ఆడకపోయినా సీక్వెల్ బాగుందనే టాక్ వస్తే.. హిట్టయ్యే ఛాన్స్ వుంది. పైగా ఇక్కడ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భారీగానే రిలీజ్ ఉంటుంది.
తమిళనాడులో ఈ పీఎస్ 2 వల్ల ఏజెంట్ కి సరైన రిలీజ్ దక్కకపోవచ్చు. అఖిల్ సినిమాలో ఎంత మమ్ముట్టి ఉన్నా కేరళలోనూ పొన్నియన్ సెల్వన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మల్టీ స్టారర్ కావడమే కారణం. లక్కీగా కరణ్ జోహార్ బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని జూలైకి వాయిదా పడింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే కాంపిటీషన్ ఇంకా తీవ్రంగా ఉండేది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 29న పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రాన్ని గతంలోనే ప్రకటించారు. ఇదేమి హీరో రేంజ్, మార్కెట్ పరంగా ఏజెంట్ కి సమానంగా నిలిచేది కాదు కానీ దాని మేకింగ్, కంటెంట్ గురించి యూనిట్ నుంచి వస్తున్న లీక్స్ చూస్తుంటే తక్కువ అంచనా వేయడానికి లేదనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మాత్రం అఖిల్ ఒక పక్క మణిరత్నంని మరో పక్క వైష్ణవ్ ని ఎదుర్కొని గెలవాలి. మరి.. ఏజెంట్ ఏం చేస్తాడో..?
Also Read : ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్