Sunday, January 19, 2025
HomeసినిమాAgent: 'ఏజెంట్' టార్గెట్ ఫిక్స్

Agent: ‘ఏజెంట్’ టార్గెట్ ఫిక్స్

అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తక్కువ టైమ్ లో ఎంతలా ప్రమోట్ చేయచ్చో అంతలా ప్రమోట్ చేయడంతో భారీగా క్రేజ్ ఏర్పడింది. దీంతో ఏజెంట్ పై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే అక్కినేని అభిమానులు అయితే.. ఈసారి అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే.. తెలుగులో రిలీజ్ అయిన వారం తర్వాత హిందీలో విడుదల చేయనున్నారు.

ఇక బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను 10 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సీడెడ్ లో 4.50 కోట్లు, ఆంధ్రాలో 14.80 కోట్లకు కొన్నారని సమాచారం. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 29.30 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా కలుపుకుని 3.80 కోట్లు బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ లో 3.10 కోట్లకు కొనుగోలు చేశారని తెలిసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 36.20 కోట్ల రూపాయల బిజినెస్ జరగ్గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 37 కోట్లుగా ఫిక్స్ అయింది.

ఈ మూవీకి బజ్ మాత్రం బాగా ఉంది. మంచి ఒపెనింగ్ వస్తుందని అంచనాలు ఉన్నాయి. యూత్ ఈ సినిమాని చూడాలని ఆసక్తిగా ఉన్నారు. అందుచేత ఈ స్పై థ్రిల్లర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లోను అలాగే ఓవర్ సీస్ లోను రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయమని టాక్ ఉంది. అఖిల్ ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా సురేందర్ రెడ్డి చూపించారు. ఈ సినిమాతో ఖచ్చితంగా అఖిల్ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటాడు అని అనిల్ సుంకర చెప్పారు. మరి.. అఖిల్ ఏజెంట్ తో ఏ రేంజ్ కి వెళతాడో.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్