Thursday, September 26, 2024
HomeTrending NewsRama Krishna Lyrical Song: 'ఏజెంట్' మరో సాంగ్ విడుదల

Rama Krishna Lyrical Song: ‘ఏజెంట్’ మరో సాంగ్ విడుదల

అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్‘. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే… చాలా సార్లు వాయిదాపడిన ఏజెంట్ మూవీని ఈ నెల 28న ఎలాగైనా సరే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఈ నేపథ్యంలో ‘ఏజెంట్‌’ లోని ‘రామకృష్ణ గోవిందా’ బ్రేకప్‌ సాంగ్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, రామ్ మిర్యాల ఆలపించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు.ఇప్పటికే రిలీజైన ‘మళ్లీ మళ్లీ’, ‘ఏందే ఏందే’ పాటలు ఇన్‌స్టాంట్‌గా ఎక్కేశాయి.

ఈ మూవీలో అఖిల్ కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. సినిమా కోసం తన బాడీని కూడా బిల్డ్ చేసి కండలు తిరిగిన దేహంతో అసలు సిసలైన ఏజెంట్ లా కనిపిస్తున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్