Saturday, September 28, 2024
Homeసినిమాఏజెంట్ హిట్ అయితే.. నాగ్ మూవీకి క్రేజ్

ఏజెంట్ హిట్ అయితే.. నాగ్ మూవీకి క్రేజ్

అక్కినేని అఖిల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’.  సురేందర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఏప్రిల్ 28న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏజెంట్ మూవీ సక్సెస్ అయితే.. నాగ్ మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం. అందేంటి.. ఏజెంట్ మూవీ సక్సెస్ కి.. నాగ్ మూవీకి ఉన్న సంబంధం ఏంటి అనుకుంటున్నారా..?  విషయం ఏంటంటే.. ప్రస్తుతం నాగ్ 99వ చిత్రాన్ని బెజవాడ ప్రసన్నకుమార్ డైరెక్షన్ లో చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత నాగ్ వందో సినిమాను చేయనున్నారు. ఈ క్రేజీ మూవీకి మోహనరాజా దర్శకత్వం వహించనున్నారు. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది అంటూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇక ఇప్పటికే మోహన్ రాజా తని ఒరువన్ లాంటి అదిరిపోయే స్టొరీ లైన్ ని నాగార్జునకి చెప్పి ఒప్పించినట్లుగా సమాచారం. ఈ మూవీని మల్టీ స్టారర్ గా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అందులో భాగంగా కింగ్ నాగార్జునతో పాటు అఖిల్ కూడా నటిస్తున్నాడని తెలిసింది.

అఖిల్ ఏజెంట్ మూవీ పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అయితే వందవ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నాగార్జున ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకి బాగా తెలుసు. చివరిగా బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటించాడు. ఈ నేపధ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో ఖచ్చితంగా రీచ్ ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అందుచేత ఏజెంట్ సక్సెస్ అయితే.. నాగ్ వందో చిత్రానికి మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. ఏజెంట్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read : ‘ఏజెంట్’ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్