Sunday, January 19, 2025
Homeసినిమాఅఖిల్ ఏజెంట్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?

అఖిల్ ఏజెంట్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?

Agent Action: అక్కినేని అఖిల్ హీరోగా స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఇందులో మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ అండ్ వ‌ర్కింగ్ స్టిల్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఏజెంట్ మూవీ పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. దీంతో ఏజెంట్ ఎప్పుడెప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఈమ‌ధ్య వైజాగ్ లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ ను చిత్రీక‌రించారు. అఖిల్ మ‌రియు కొంత మంది ఫైట‌ర్స్ పై చిత్రీక‌రించిన ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్ కానుంద‌ని టాక్ వినిపిస్తోంది. తాజా అప్ డేట్ ఏంటంటే… మనాలిలో జరిగిన షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో ర‌న్ ఛేజింగ్ సీన్స్ చిత్రీక‌రించారు. ఇందులో ఇప్పటి వరకు చూడని అఖిల్ ని చూడబోతున్నార‌ని చిత్ర‌యూనిట్ చెబుతున్నారు.

ఇక ఈ మూవీ టీజర్ ను ఈ నెలలో రిలీజ్ చేయ‌నున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తార‌నేది డేట్ అతి త్వరలో ప్ర‌క‌టిస్తారు. ఇక మూవీ రిలీజ్ విష‌యానికి వ‌స్తే.. ఆగ‌ష్టు 12న ఏజెంట్ అని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు కానీ.. అనౌన్స్ చేసిన‌ట్టుగా ఏజెంట్ ఆగ‌ష్టు 12న రావ‌డం లేదు అని ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. మ‌రి.. అనౌన్స్ చేసిన‌ట్టుగా ఆగ‌ష్టు 12నే ఏజెంట్ వ‌స్తుందా..?  వాయిదా ప‌డ‌నుందా..?  అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : కులుమనాలి లో ‘ఏజెంట్’ ఏం చేస్తాడో?

RELATED ARTICLES

Most Popular

న్యూస్