Sunday, January 19, 2025
HomeసినిమాAkkineni Akhil: సంతోషంలో అక్కినేని ఫ్యాన్స్

Akkineni Akhil: సంతోషంలో అక్కినేని ఫ్యాన్స్

అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూవీ ఏజెంట్. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ‘ఏజెంట్’ వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను నిరాశకు గురి చేస్తూ వచ్చింది.  ఏప్రిల్ 28న గ్యారెంటీ విడుదల అని అనౌన్స్ చేసినా ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. దీంతో ఈసారి కూడా రిలీజ్ డౌటే అని ఫాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఎట్టకేలకు ‘ఏజెంట్’ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో సినిమా విడుదల పక్కా అని క్లారిటీ వచ్చింది. అక్కినేని అభిమానులు  తెగ సంబరపడుతున్నారు.

అఖిల్ బర్త్ డే పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లు పక్కా ప్లాన్ తో చేయాలని  నిర్ణయించారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాతో ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలని అఖిల్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. మరి.. ఏజెంట్ తో ఎలాంటి హిట్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్