Tuesday, January 21, 2025
HomeTrending NewsAgent Trailer: వైల్డ్ గా 'ఏజెంట్' ట్రైలర్.

Agent Trailer: వైల్డ్ గా ‘ఏజెంట్’ ట్రైలర్.

అక్కినేని అఖిల్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ లో బిజీగా ఉంది అఖిల్ టీం. ప్రమోషన్స్ లో భాగంగా కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో ఏజెంట్‌ ట్రైలర్‌ ను లాంఛ్ చేశారు.

నువ్వు ఏజెంట్ ఎందుకు కావాలనుకుంటున్నావ్‌.. అని అఖిల్‌ను మమ్ముట్టి అడుగుతున్న సంభాషణలతో మొదలైంది ట్రైలర్‌. సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమేనని మమ్ముట్టి అంటుండగా.. చేతిలో గన్ను, యాక్షన్‌, ఎమోషన్‌, ప్రతీ నిమిషం గూస్ బంప్సే కదా జీ అంటున్నాడు ఏజెంట్ అఖిల్. ఏజెంట్‌గా అఖిల్ స్టన్నింగ్ యాక్షన్‌ థ్రిల్లింగ్ అవతార్‌లో ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాడంటూ ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్‌.

ఈ చిత్రంలో మమ్ముట్టి  కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజెంట్‌తో మోడల్‌ సాక్షి వైద్య తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెరువనుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఏజెంట్‌ చిత్రానికి వక్కంతం వంశీ కథనందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్